కోట సత్తెమ్మ ఆలయంలో దీపోత్సవం
ABN , First Publish Date - 2020-12-12T04:34:21+05:30 IST
వీరవాసరం కోట సత్తెమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం నిర్వహించారు.
వీరవాసరం, డిసెంబరు 11: వీరవాసరం కోట సత్తెమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సహస్రదీపారాధనతో భక్తులు దీపాలను వెలిగించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఉంగరాల కోటయ్య, చామకూరి సూర్యనారాయణ, కూనపరెడ్డి రామారావు, నిమ్మల సురేష్ , పులఖండం సతీష్ ఆధ్వర్యంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు.
వీరవాసరం గ్రామ దేవత గోగులమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏకాహం (భజన) నిర్వహించారు. తమలపాకు వీధి రామాలయం, పెదవీధికి చెందిన సాకేతరామ భజన సమాజాలు సంకీర్తన చేశారు.