ఉద్యాన వర్సిటీలో వాతావరణ కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-30T04:23:11+05:30 IST
వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీలో వాతావరణ పర్యవేక్షక కేంద్రాన్ని వీసీ డాక్టర్ టి.జానకి రామ్ మంగళవారం ప్రారంభించారు.
తాడేపల్లిగూడెం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీలో వాతావరణ పర్యవేక్షక కేంద్రాన్ని వీసీ డాక్టర్ టి.జానకి రామ్ మంగళవారం ప్రారంభించారు.వాతావరణంలో వస్తున్న మార్పులపై ఉద్యాన విద్యార్థులకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో భారత వాతావరణ శాఖకు అనుసందానం చేసి ఎప్పటికప్పుడు వాతా వరణంలో మార్సులు, ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తామన్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు నిర్వహించే పరిశోధనలకు వాతావరణ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. వాతావరణ పర్య వేక్షక కేంద్రంలో భాగంగా రెయిన్ గేజ్ మీటర్, విండ్ వెస్, ఎనిమోమీటర్ తదితర పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్ డాక్టర్ గోపాల్, విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.శ్రీనివాసులు, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్‌వీఎస్‌కె రెడ్డి, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎంఎల్‌ఎన్ రెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఎ.సుజాత, యూనివర్శిటీ లైబ్రేరియన్ డాక్టర్ డి.వెంకట స్వామి, అసోసియేట్ డీన్ డాక్టర్ కె.ఉమాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.