ముక్కోటి పూజలు

ABN , First Publish Date - 2020-12-26T05:09:26+05:30 IST

వైకుంఠ ఏకాదశి మోక్ష ద్వారం. కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి.

ముక్కోటి పూజలు
భీమవరంలో వేంకటేశ్వరుడు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

వైకుంఠ ఏకాదశి మోక్ష ద్వారం. కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి. నరసాపురం పట్టణ, మండలంలోని వేంకటేశ్వరస్వామి, ఎంబర్‌మన్నార్‌ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. ఆకివీడులోని మాదివాడ వేం కటేశ్వరస్వామి, మదన గోపాలస్వామి దేవస్థానాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. కాళ్ళ మండలం కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి, సీసలి సాయిబాబా, కాళ్ళలో పాండురంగస్వామి దేవాలయాలలో భగవంతుని ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ కట్టారు. కాళ్ళకూరు శ్రీవేంకటేశ్వరస్వామిని సుమారు 20 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపా రు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, సుస్మిత దంపతులు స్వామివారిని దర్శించు కున్నారు. ఆచంటలోని మదనగోపాలస్వామి, సత్యనారాయణ స్వామి, కొడమంచిలిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలను భక్తులు ఉత్తరం ద్వారం ద్వారా దర్శించుకున్నారు. కొడమంచిలిలో రథోత్సవం వైభవంగా సాగింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. యలమంచిలి, అడవిపాలెం, దొడ్డిపట్ల, చిం చినాడ, మేడపాడు, కాజ గ్రామాల్లో ఆంజనే యస్వామి ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యే క అలంకరణలు చేసి నాగవల్లీదళ, గంధ సింధూర అర్చనలు చేశారు. అబ్బిరాజుపా లెం, గుంపర్రు వెంకటేశ్వరస్వామి ఆలయా ల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. మొగల్తూరులోని రుక్మిణీ సత్య భామ సమేత రాజగోపాలస్వామి, వేంకటేశ్వ రస్వామి, కేపీ.పాలెం రాజగోపాలస్వామిని భక్తులు దర్శించుకున్నారు. పేటపల్లం రామాలయంలో సత్యనారాయణస్వామి వ్రతమహోత్సవాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణంలోని పద్మావతి వేంక టేశ్వరస్వామి, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి మందిరంలో విశేష పూ జలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామివారిని దర్శించు కున్నారు. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనస్వామిని, భీమేశ్వరస్వామి ఆలయం లో జనార్ధనస్వామిని భక్తులు దర్శించుకు న్నారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వా మి ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనస్వామి ని భక్తులు దర్శించుకున్నారు. అష్టభుజ ల క్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శంభన్న అగ్రహారం, కెనాల్‌ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిం చుకున్నారు. రంగమన్నారుపేటలో పాండు రంగస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శ నం ఏర్పాటు చేశారు. ఉండి మండలం ఉ ప్పులూరు చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చేశారు. భీమవరం మండలం తుందుర్రు శక్తీశ్వరస్వామి, దిరుసుమర్రు గంగా భ్రమరాంబిక రామలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరవాసరంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాం గణంలో సత్యదేవుని వ్రతాలను ఏర్పాటు చేశారు. మత్స్యపురి జనార్ధనస్వామి ఆల యంలో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. నవుడూరు జంక్షన్‌ శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. నందమూరుగరువు భక్తాంజనేయస్వామిని దర్శించుకున్నారు. పోడూరు మండలం పెనుమదం ఉమా అగస్త్యేశ్వర స్వామి ఉపాలయమైన సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు.









Updated Date - 2020-12-26T05:09:26+05:30 IST