-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari teachers
-
వెబ్ బదిలీల గుబులు
ABN , First Publish Date - 2020-12-19T05:46:44+05:30 IST
మూడేళ్ల విరామం తరువాత తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వ హిస్తున్న బదిలీలు టీచర్లకు ముచ్చె మటలు పట్టిస్తున్నాయి.

కొనసాగుతున్న సర్వర్ మొరాయింపు
సాంకేతిక అవరోధాలు..
వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న టీచర్లలో
వెంటాడుతున్న భయాందోళనలు
కోరుకున్న బదిలీ స్థానం వస్తుందో రాదోనన్న డైలమా
నెలాఖరు వరకు వెబ్ ఆప్షన్ పొడిగింపు
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 18 : మూడేళ్ల విరామం తరువాత తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వ హిస్తున్న బదిలీలు టీచర్లకు ముచ్చె మటలు పట్టిస్తున్నాయి. బదిలీ స్థానా లకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో ఎదురవుతున్న పలు సాంకేతిక అవ రోధాలు జిల్లాలో బదిలీకి దరఖాస్తు చేసుకున్న మొత్తం 5,706 మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మందిని ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వేధిస్తూనే ఉన్నాయి. హెచ్‌ఎం కేడర్ మొదలుకుని లాంగ్వేజ్ పండిట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు, సెకండరీగ్రేడు టీచర్లు, ఎస్‌జీటీ ఇలా అన్ని క్యాడర్ల ఉపా ధ్యాయులు వెబ్ ఆప్షన్ల బాధితులుగా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు వెబ్ ఆప్షన్లకు మూడు దఫాలుగా పొడిగించిన గడువు శుక్రవారం అర్ధరా త్రితో ముగుస్తుండగా, సర్వర్ మొరాయింపు, సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న టీచర్లలో పలువురు తీవ్ర ఆందోళన పడుతుండగా, తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయుల్లో మరిన్ని రెట్లు భయాందో ళనలు కొనసాగుతున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ పద్ధతిన చేపట్టిన బదిలీలు ఎటువంటి విమర్శలకు, ఆందోళనలకు తావులేకుండా సాఫీగా జరగడానికి సాంకేతికంగా సరైన చర్యలు, ఏర్పాట్లు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌పై ఉపాధ్యాయ సంఘాల ఆందోళనను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోవడం సర్వత్రా విమర్శల పాలవుతోంది.
సాంకేతిక అవరోధాలు ఇవిగో..
మూడు రోజులుగా సర్వర్ మొరాయింపు, ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ బదిలీ దరఖాస్తు/ వెబ్ ఆప్షన్లకు ఉద్దేశించిన సీఎస్‌ఈ సైట్ ఓపెన్ కాలేదు. బదిలీ దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు ఎడిట్ ఆప్షన్‌ను గురువారం పూర్తిగా ఇస్తామన్నారు. కానీ అలా జరగలేదు.
తప్పనిసరిగా బదిలీ స్థానాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకునేందుకు దాదాపు మూడు వేల వేకెన్సీలకు (ప్లెయిన్ ఏరియా) వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి వేకెన్సీలకు ఆప్షన్లు ఇచ్చి ప్రివ్యూ చూసుకున్న అనంతరం దరఖాస్తుదారుని ట్రెజరీ ఐడీ, పుట్టిన తేదీ, యూజర్ పాస్ వర్డ్‌లతో సబ్‌మిట్ చేసిన వెంటనే ఆప్షన్లు ఇచ్చుకున్న స్థానాలన్నీ మాయమవుతున్నాయి. స్ర్కీన్‌పై నాట్ లింక్డ్ అని వస్తోంది. ఎడిట్ కూడా అవ్వడం లేదని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ల కోసం 1,940 మంది ఎస్‌జీటీలు దరఖాస్తు చేసుకున్నారు. వీరు డిస్‌ప్లేలో పెట్టిన వేకెన్సీలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అనంతరం ప్రివ్యూ చూసుకుంటే జీరో అని చూపిస్తోంది.
కంపల్సరీ ట్రాన్స్‌ఫర్, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ టీచర్లు ఇప్పటికే నమోదు చేసిన బదిలీ స్థానాల ప్రాధాన్యతా క్రమాన్ని సవరించుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చారు. ఆ ప్రకారం బదిలీ స్థానాల ప్రాధాన్యతను మార్చుకున్న అనంతరం సబ్‌మిట్ కొట్టిన తరువాత చూస్తే.. ఏ స్థానానికి ప్రాధాన్యతను ఎడిట్ చేసుకున్నారో అంతవరకే సబ్‌మిట్ అయి మిగతా స్థానాలు మాయమవుతున్నాయి. దీనివల్ల కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అమ్మ ఒడి చైల్డ్‌ఇన్‌ఫో నమోదుకు, టీచర్ల బదిలీలను ఏకకాలంలో నిర్వహిస్తుండడం, వాటి నమోదుకు సైట్ ఒక్కటే కావడం వల్ల సర్వర్ తరచూ మొరాయించడానికి కారణమవుతోందని గుర్తించారు.
నెలాఖరు వరకు వెబ్ ఆప్షన్
తప్పనిసరి బదిలీ టీచర్లు, వెబ్ ఆప్షన్లు సబ్‌మిట్ చేయని టీచర్లు ఈ నెల 21, 22 తేదీల్లో సంబంధత ఎంఈవో కార్యాలయాల్లో సబ్‌మిట్ చేసుకునే అవకాశాన్ని తాజాగా కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ ఆయ్యాయి. అలాగే ఎవరైతే ఆప్షన్లు సరిగా నమోదు చేయని టీచర్లు ఈ నెల 23వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు సంబంధిత మండల విద్యా శాకాధికారి కార్యాలయంలో సబ్‌మిట్ చేసుకోవచ్చు. సర్వర్ లోడ్ సమస్య అధిగమించేందుకు ఎంఈవో కార్యాలయంలో రోజూ పది దరఖాస్తులను మాత్రమే సబ్‌మిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ మేరకు ఎంఈవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్వర్వులు జారీచేశారు.