-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari tdp nirasana
-
రైతు ఆత్మహత్యలు ఆపాలి
ABN , First Publish Date - 2020-12-29T04:36:11+05:30 IST
గత 18 నెలలుగా ఆం ధ్రప్రదేశ్‌లో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఏలూ రు పార్లమెంటు నియో జకవర్గ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజ నేయులు అన్నారు.

భీమడోలు, డిసెంబరు 28 : గత 18 నెలలుగా ఆం ధ్రప్రదేశ్‌లో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఏలూ రు పార్లమెంటు నియో జకవర్గ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజ నేయులు అన్నారు.ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిర సిస్తూ టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు క్యాంపు కార్యాల యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. దేశానికి వెన్నెముఖగా నిలిచే రైతన్నలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు.ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చిందని ఈ ప్రభు త్వం దాన్ని ఏడు లక్షలకు పెంచుతూ జీవో విడుదల చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు రెండు లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మ హత్యల సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం శ్వేతపత్రం,కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తణుకులో గాంధీ విగ్రహానికి వినతి..
తణుకు, డిసెంబరు 28 : రైతులు ఆత్మహత్యలు నివారించాలని నరసాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి డిమాండ్ చేశారు.తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగు రైతు ఆధ్వ ర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. మహాత్మగాంధీ విగ్రహానికి, రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి తమ్మినేని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అడ్డాల సాయిబాబు, అధికార ప్రతినిధి తానేటి దాసు, కార్యదర్శి సత్తి సోమశేఖర్ కుమార్ రెడ్డి, పట్టణ సెక్రటరీ తమరాపు పల్లపురావు, సప్పా రాజు, తమరాపు సత్యనారాయణ, రమణమ్మ, గుమ్మల హనుమంతు, తేతలి సాయి, మాజీ ఎంపీపీ సాదే శామ్యూల్ రాజు, మారుతీరావు పాల్గొన్నారు.