-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari tdp janasena agitation on formers problems
-
రైతులను ఆదుకోవడంలో.. జగన్ ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-12-29T05:23:14+05:30 IST
తెలుగుదేశం పార్టీ రైతు కోసం సంఘీ భావ నిరసనలను పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించింది. తణుకు, భీమ డోలు, పాలకొల్లు, యలమంచిలిలలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చే పట్టారు.

జిల్లావ్యాప్తంగా టీడీపీ, కలెక్టరేట్ వద్ద జనసేన నిరసనలు
ఏలూరు, డిసెంబరు 28(ఆంద్రజ్యోతి):తెలుగుదేశం పార్టీ రైతు కోసం సంఘీ భావ నిరసనలను పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించింది. తణుకు, భీమ డోలు, పాలకొల్లు, యలమంచిలిలలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చే పట్టారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటను అంచనా వేయడంలో తీవ్ర అలస త్వం కారణంగా రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఏలూరు పార్లమెం టు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు భీమడోలులో జరిగిన ఆందోళనలో ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ఇచ్చిందని ఈ ప్రభుత్వం దాన్ని ఏడు లక్షలకు పెంచుతూ జీవో విడుదల చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు రెండు లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు. తణుకులో మహాత్మాగాంధీ విగ్రహానికి తెలుగు రైతు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. రైతుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. భీమవరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద జనసేన ధర్నా చేసింది. రైతుల కు ఎకరానికి 35 వేలు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.