జిల్లాలో ప్రతి నెలా 400 టీబీ కేసులు : జేసీ
ABN , First Publish Date - 2020-12-30T04:26:52+05:30 IST
జిల్లాలో ప్రతి నెల 300 నుంచి 400 వరకూ టీబీ కేసులు నమోదవుతున్నాయని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 29 : జిల్లాలో ప్రతి నెల 300 నుంచి 400 వరకూ టీబీ కేసులు నమోదవుతున్నాయని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా క్షయ నియంత్రణ (టీబీ) ఫోరమ్ సమావేశం నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ బి.భానునాయక్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జనవరి 26వ తేదీ వరకూ కొత్త కేసులను కనుగొనేందుకు క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి ఇంటా వైద్య సిబ్బంది టీబీ సర్వే చేసి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పీహెచ్‌సీలకు పంపిస్తారన్నారు. సమావేశంలో అధికారులు విద్యానంద్, ప్రేమ్‌కుమార్, రఘు, డీపీఎస్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.