ఇసుక కొనుగోల!

ABN , First Publish Date - 2020-12-31T04:31:43+05:30 IST

ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఇంటర్నెట్‌ నిర్వాహకులకు కలిసి వస్తోంది. ఇసుక బుకింగ్‌లో ఆన్‌లైన్‌ దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇసుక కొనుగోల!
తాడేపల్లిగూడెంలో స్టాక్‌ యార్డ్‌

ఆన్‌లైన్‌ ఇసుక దోపిడీ 

తాడేపల్లిగూడెంలో బుక్‌ చేస్తే స్టాక్‌ యార్డ్‌ ఇసుకే దిక్కు

ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ

పక్క నియోజకవర్గంలో బుక్‌ చేస్తే రీచ్‌ల నుంచి సరఫరా 

ఇంటర్నెట్‌ నిర్వాహకులకు రూ. 2 వేలు

దిగుమతి చేసేందుకు మరో రూ.1500 

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఇంటర్నెట్‌ నిర్వాహకులకు కలిసి వస్తోంది. ఇసుక బుకింగ్‌లో ఆన్‌లైన్‌ దోపిడీకి పాల్పడుతున్నారు. కొన్ని మీ సేవ కేంద్రాల్లోనూ దందా సాగుతోంది. తాడేపల్లిగూడెం స్టాక్‌ యార్డు నుంచి ఇసుక సరఫరా తప్పించుకోవడానికి కొనుగోలుదారులు ఇంటెర్నెట్‌ నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. అదనపు సొమ్ములు ముట్ట చెబుతు న్నారు. గోదావరి రీచ్‌ల నుంచి ఇసుక రప్పించుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఇలా ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే  రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. 


నాసిరకం ఇసుక బాధలు తప్పించుకోవడానికి..

తాడేపల్లిగూడెం స్టాక్‌ యార్డులో నాసిరకం ఇసుక బాధలు తప్పించు కోవడానికి కొనుగోలుదారులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభుత్వం స్టాక్‌ యార్డులో ఉన్న ఇసుక వదలించుకోవడానికి తాడేపల్లిగూడెం నియో జకవర్గంపైనే ఆధార పడుతోంది. దాంతో కొనుగోలుదారులు పక్క దారి  ఆశ్రయిస్తున్నారు.ఇతర నియోజకవర్గాల్లో ఉంటున్న వారి ఆధార్‌ నెంబర్లతో ఇసుక బుక్‌ చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఇళ్లు నిర్మిస్తున్నట్టు చూపుతున్నారు.దాంతో గోదావరి రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది. అక్కడే మళ్లీ దందా సాగుతోంది. రీచ్‌ల నుంచి తాడేపల్లిగూడెంలో ఇసుక దింపాలంటే లారీ యజమానికి అదనంగా రూ.1500 చెల్లిస్తున్నారు. అయినా సరే స్టాక్‌ యార్డు కంటే తక్కువ ధరకే ఇసుక లభ్యమవుతోంది. గోదావరి రీచ్‌ల నుంచి తాడేపల్లిగూడెం పట్టణానికి ఇసుక సరఫరా చేయాలంటే గరిష్టంగా రూ. 13 వేలు అవుతోంది.ఒక లారీలో 18 టన్నులు సరఫరా అవుతోంది. అదే తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న స్టాక్‌ యార్డు నుంచి ఇసుక కావాలంటే రూ. 20,500 చెల్లించాల్సి వస్తోంది. అదికూడా నాణ్యత ఉండడం లేదు.ఈ సమస్యను అధిగమించేందుకు కొనుగోలుదా రులు ప్రత్యామ్నాయం ఆలోచించారు.కొందరు ఇంటర్నెట్‌ నిర్వాహకులు తోడ్పాటునందిస్తున్నారు.అయితే పెద్ద్ద మొత్తంలో ఇసుక అవసరమైన నిర్మాణదారులు మాత్రం స్టాక్‌ యార్డులపైనే ఆధార పడాల్సి వస్తోంది. దాంతో నిర్మాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం


కొనుగోలుదారుల గగ్గోలు...

 జిల్లా వాసులందరికీ ఇసుక సరఫరా చేసేందుకని స్టాక్‌ యార్డులో నిల్వ చేసి ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికే దానిని పరిమితం చేస్తున్నారు.దీనిపై నియోజకవర్గంలో ఇసుక కొనుగోలుదారులంతా గగ్గోలు పెడుతున్నారు. అయినా సరే ఇప్పటి వరకూ రీచ్‌ల నుంచి బుక్‌ చేసుకునే అవకాశం కల్పించడం లేదు. ఆధార్‌ నెంబర్‌తో ఇసుక్‌ బుక్‌ చేసుకోవ డానికి అవకాశం కల్పించడంతో అక్రమంగానైనా రీచ్‌ల నుంచి ఇసుక సర ఫరా అవుతోంది. గతంలో ఇంటి ప్లాన్‌ ఉంటేనే ఇసుక సరఫరా అయ్యేది. దానివల్ల సక్రమంగా ఇసుక సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌ ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణాలతో సంబంధం లేదు. దాంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిజమైన నిర్మాణదా రులు ఇబ్బందులు పడుతున్నారు. ల

Updated Date - 2020-12-31T04:31:43+05:30 IST