వైభవంగా షష్ఠి మహోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-21T05:03:11+05:30 IST

వైభవంగా షష్ఠి మహోత్సవాలు

వైభవంగా షష్ఠి మహోత్సవాలు
కొత్తకమ్మవారిగూడెంలో స్వామి కల్యాణం

దెందులూరు/పెదవేగి/ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 20 : సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయా ఆలయాల్లో స్వామికి ప్రత్యే క పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దెందులూరు మం డలం చల్లచింతలపూడి శివారు కొత్తకమ్మవారిగూడెంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వేకువజామున స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి మండపారాధన, న వగ్రహ హోమం నిర్వహించారు. కలశపూజ, స్వామి కల్యా ణాన్ని నిర్వహించారు. నాగేంద్రస్వామికి పూజలు నిర్వహిం చి స్వామిని దర్శించుకున్నారు. పెరుగుగూడెం, శ్రీరామవ రం, రామారావుగూడెం, మేదినరావుపాలెం, దెందులూరు, గోపన్నపాలెం, గంగన్నగూడెం తదితర గ్రామాల్లోని సుబ్ర హ్మణ్యస్వామి, శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో కల్యా ణం అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.


పెదవేగి మండలంలో...

కొప్పులవారిగూడెం పంచాయతీ సీతాపురంలోని వల్లీ దేవసేన సమేత  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆల య నిర్మాణకర్తలు ఉండవల్లి వెంకటరావు, ఉండవల్లి రా ము దంపతుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. పెదవేగి, న్యాయంపల్లి, సీతాపురం, కొప్పులవారిగూడెం, కూచింపూడి, లక్ష్మీపురం తదితర గ్రామాల నుంచి భక్తు లు అధికసంఖ్యలో స్వామిని దర్శించుకుని, కల్యాణాన్ని తిలకించారు. వేగివాడలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వైభవం గా ప్రారంభమయ్యాయి. అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి మూలమూర్తులకు ఏకాదశ రుద్రాభిషేకం తది తర పూజలు నిర్వహించారు.


ఏలూరు నగరంలో..

 నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద, పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. దేవాలయాల ప్రాంగణాల్లోనూ, ప్రధాన రహ దారుల వద్ద గల పుట్టల వద్ద భక్తులు షష్ఠి సందర్భంగా పుట్టలో పాలు పోశా రు. చిన్నారులకు చెవి పోగులు కుట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్‌ కాలనీలో, పత్తేబాద, అశోక్‌ నగర్‌లలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద స్వామివారి కల్యాణాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జరిపారు. 

Updated Date - 2020-12-21T05:03:11+05:30 IST