-
-
Home » Andhra Pradesh » West Godavari » West Godavari stories trains bandh
-
నెలాఖరు వరకు రైళ్లు బంద్
ABN , First Publish Date - 2020-03-23T11:19:10+05:30 IST
నెలాఖరు వరకు రైళ్లు బంద్

- గుడ్స్ రైళ్లకు మాత్రమే అనుమతి
- జిల్లాలో స్టేషన్లకు తాళాలు
ఏలూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెలాఖరు వరకు రైళ్ల రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు ఆదేశాలు వెలు వడ్డాయి. ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా జిల్లా మీదుగా రాకపోకలు సాగించే విశాఖపట్నం, విజయవాడ, రా జమండ్రి, కాకినాడ, సికింద్రాబాద్, చెన్నై, భువనేశ్వర్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. అన్ని రైల్వే స్టేషన్లలోని అధికారుల కార్యాలయాలకు, బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లకు తాళాలు వేసేశారు. జిల్లా లోని రైల్వే స్టేషన్లన్నింటినీ మూసేసి ప్రొటెక్టెడ్ ఏరియా క్రాస్ రిబ్బన్లను ఏర్పాటు చేశారు.
వాటిని దాటుకుని ఎవరైనా స్టేషన్‌లోకి వస్తే వారిపై రేల్వే చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు చేస్తామని ఏలూరు స్టేషన్ సూపరింటెండెంట్ సత్యనారాయణ హెచ్చరించారు. గూడ్సు రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ రద్దయిన వారికి వారి డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. టిక్కెట్లు రద్దయిన వారంతా ఏప్రిల్ 1 నుంచి జూన్ 21వ తేదీ వరకూ వారి నగదు తీసుకోవచ్చు.
కంట్రోల్ రూమ్‌కు టోల్ ఫ్రీ 1800 233 1077
కరోనా వ్యాప్తిని నిరోఽధానికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్ నెంబరు పని చేయకపోవడంతో ఆదివారం కొత్త నెంబరు 1800 233 1077ను మార్చినట్లు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు.