జిల్లా అంతటా సూపర్ చెకింగ్‌లు
ABN , First Publish Date - 2020-12-15T05:44:40+05:30 IST
జిల్లావ్యాప్తంగా ప్రతినెలా స్థలాలు లేదా భవన నిర్మాణాల విలువలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సూపర్ చెకింగ్ నిర్వహిస్తామని జిల్లా రిజిస్ట్రారు లంకా వెంకటేశ్వర్లు అన్నారు.
వాస్తవ విలువ తగ్గించి రిజిస్ర్టేషన్ చేయిస్తే పెనాల్టీ
జిల్లా రిజిస్ట్రారు లంకా వెంకటేశ్వర్లు
నిడదవోలు, డిసెంబరు 14 : జిల్లావ్యాప్తంగా ప్రతినెలా స్థలాలు లేదా భవన నిర్మాణాల విలువలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సూపర్ చెకింగ్ నిర్వహిస్తామని జిల్లా రిజిస్ట్రారు లంకా వెంకటేశ్వర్లు అన్నారు. వాస్తవ విలువను తగ్గించి రిజిస్ట్రేషన్‌లు చేయిం చుకున్న వారిని గుర్తించి రూ. 10 లక్షల వరకు అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు. సోమవారం నిడదవోలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎవరైనా స్థలాల విలువ దాచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అలాంటి వారిపై తదుపరి రిజిస్ట్రేషన్లు జరుగకుండా నిలుపుదల చేస్తామన్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమడోలు, కామ వరపుకోట కార్యాలయాల్లో సబ్ రిజిస్ర్టార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అక్కడ ఇన్‌చార్జిలే విధులు నిర్వహిస్తు న్నారని తెలిపారు. జిల్లాలోని మద్దూరులంక, చిగురులంక, చిక్కాల, తాడిమళ్ళ, ఉనకరమిల్లి, కోరుమామిడి, రావిమెట్ల, విస్సంపాలెం గ్రామాల్లో భూమి ధరలు రివిజన్ జరగలేదని త్వరలోనే జరుగనుందని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో రూ.28.54 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా నవంబరు నెలా ఖరునాటికి రూ.18.27 కోట్లు ఆదాయం లభించిందన్నారు. నిడదవోలు సబ్ రిజిస్ట్రారు సోని, సిబ్బంది ఉన్నారు.