మాదక ద్రవ్యాలతో సమాజానికి చేటు

ABN , First Publish Date - 2020-12-17T05:58:17+05:30 IST

మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తమ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా సమాజం కూడా నాశనం అవుతుం దని, దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు అన్నారు.

మాదక ద్రవ్యాలతో సమాజానికి చేటు
ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు

ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు 

ఏలూరు క్రైం, డిసెంబరు 16 : మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తమ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా సమాజం కూడా నాశనం అవుతుం దని, దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ సీవీ జయరామరాజు అన్నారు. యాంటీ డ్రగ్స్‌ వారోత్సవాలను పురస్క రించుకుని ఏలూరు అమీనాపేట పోలీస్‌ కల్యాణమండపం వద్ద బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకూ యాంటీ డ్రగ్‌ వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో అవగాహ న, చైతన్యం కల్పిస్తామన్నారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ అద నపు ఎస్పీ మహేష్‌ కుమార్‌, డీఎస్పీ డాక్టర్‌  దిలీప్‌ కిరణ్‌, ఎస్‌ఈబీ అసిస్టెం ట్‌ కమీషనర్‌ జయరాజు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:58:17+05:30 IST