-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari sambho sankara
-
శంభో శంకరా..
ABN , First Publish Date - 2020-12-15T05:51:19+05:30 IST
కార్తీకమాసం ఆఖరి సోమవారం, అమా వాస్య కలసి రావడంతో జిల్లాలోని పంచారామ క్షేత్రాలతోపాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

కార్తీకమాసం చివరి సోమవారం భక్తుల తాకిడి
పాలకొల్లు అర్బన్, డిసెంబరు 14 : కార్తీకమాసం ఆఖరి సోమవారం, అమా వాస్య కలసి రావడంతో జిల్లాలోని పంచారామ క్షేత్రాలతోపాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే నదీస్నానాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామిని సుమారు 20 వేలమంది దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరస్వామిని దాదాపు 30 వేల మంది భక్తులు దర్శించుకుని ఉంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. స్వామివారికి టికెట్ల ద్వారా లక్షా 60 వేల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేకువజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.