రిజిస్ర్టేషన్ల రెవెన్యూ ఆశాజనకం

ABN , First Publish Date - 2020-12-20T05:14:59+05:30 IST

జిల్లాలో రిజిస్ర్టేషన్ల రెవెన్యూ ఆశాజనకంగా ఉందని స్టాంప్స్‌ అండ్‌ రిజస్ర్టేష న్‌ డీఐజీ శివరాం చెప్పారు.

రిజిస్ర్టేషన్ల రెవెన్యూ ఆశాజనకం

 స్టాంప్స్‌ అండ్‌ రిజస్ర్టేషన్‌ డీఐజీ శివరాం

నరసాపురం, డిసెం బరు 19 : జిల్లాలో రిజిస్ర్టేషన్ల రెవెన్యూ ఆశాజనకంగా ఉందని స్టాంప్స్‌ అండ్‌ రిజస్ర్టేష న్‌ డీఐజీ శివరాం చెప్పారు. శనివారం న రసాపురం సబ్‌ రిజి స్ర్టార్‌ కార్యాలయాలను ఆయన తనిఖీ చేసి రి కార్డులను పరిశీలించారు. ఆనంతరం విలేకర్లతో మాట్లాడు తూ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఊహించిన దాని కంటే ఆదాయం పెరిగిందన్నారు. ఇలాగే కొనసాగితే మార్చి నాటికి నిర్ధేశిం చిన లక్ష్యం చేరుకుంటామన్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న అన్ని రిజస్ర్టేషన్‌ కార్యాలయాలను త్వరలో ఆధునీకరిస్తామన్నారు. తరచూ సర్వర్లలో తలెత్తున్న సాంకేతిక సమస్య కూడా పరిష్కరిస్తామ న్నా రు. ఇందుకు కొత్త సర్వర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయాల్లో రిజిస్ర్టేషన్ల విధానం ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా ఉందన్నారు. గుంటూరు జిల్లాలో రెండు సచివాలయాల్లో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. అక్కడ విజయవంతం అయితే మిగిలిన జిల్లాల్లో అమలు చేసే అవకాశం ఉందన్నారు. రిజిస్ర్టార్‌ ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-20T05:14:59+05:30 IST