-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari ration rice
-
180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-31T04:29:12+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు విజిలెన్స్ సీఐ యు.జోసెఫ్ విల్సన్ తెలిపారు.

పెదవేగి, డిసెంబరు 30 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు విజిలెన్స్ సీఐ యు.జోసెఫ్ విల్సన్ తెలిపారు. చింతలపూడి మండలం రాఘవాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విజిలెన్స్ ఎస్పీ వరదరాజుకు సమాచారం అందింది. ఈ మేరకు పెదవేగి మండలం విజయరాయి దగ్గర విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారుజామున రేషన్ బియ్యం లోడుతో వస్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. ఆ లారీలో 180 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యంతోపాటు లారీని సీజ్ చేశామని తెలిపారు. బియ్యం విలువ రూ.3.24 లక్షలు కాగా, లారీ విలువ రూ.9 లక్షలు అని చెప్పారు. లారీ డ్రైవర్, గుమస్తాతో పాటు లారీ యజమాని, బియ్యం వ్యాపారి అయిన రాఘవాపురానికి చెందిన గుబ్బల శ్రీనివాసరావుపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ తహసీల్దార్ రవికుమార్, సివిల్ సప్లయ్ డీటీ ప్రమోద్‌కుమార్, సిబ్బంది