రద్దయిన కార్డుదారులకు అవకాశం

ABN , First Publish Date - 2020-12-15T05:46:29+05:30 IST

నవశకం సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం...మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్న రేషన్‌ కార్డులను తొలగించి కొత్తగా బియ్యం కార్డులను అంద జేసింది.

రద్దయిన కార్డుదారులకు అవకాశం

సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

ఏలూరుసిటీ, డిసెంబరు 14: నవశకం సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం...మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్న రేషన్‌ కార్డులను తొలగించి కొత్తగా బియ్యం కార్డులను అంద జేసింది. ఏప్రిల్‌ నుంచి బియ్యం కార్డులకు మాత్రమే రేషన్‌ అందించాలని నిర్ణయించింది. అయితే మార్చిలో కరోనా విజృంభించడంతో అన్ని కార్డులకు ఉచిత రేషన్‌ అందిం చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి నవంబరు వరకు 16 విడతలపాటు అన్ని కార్డులకు ఉచిత రేషన్‌ అందించారు. డిసెంబర్‌లో సాధారణ పద్ధతిలో రేషన్‌ అందించాలని నిర్ణయించడంతో గతంలో నవశకం సర్వేలో రద్దయిన కార్డులను మినహా యించి మిగిలిన కార్డులకు మాత్రమే రేషన్‌ అందిస్తున్నారు. గతంలో జిల్లాలో 12.93 లక్షల కార్డులు ఉండగా కొన్ని కార్డులు తొలగించడంతో 12.29 లక్షల బియ్యం కార్డులకు మాత్రమే రేషన్‌ అందించాలని నిర్ణయించారు. 64,056 కార్డులకు రేషన్‌ కట్‌చేశారు. రద్దయిన కార్డుల్లో అర్హులుంటే ధ్రువీకరణ పత్రాలు చూపించి గ్రామ/వార్డు సచివాల యాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి సుబ్బరాజు తెలిపారు. జిల్లాలో 75.59 శాతం మందికి డిసెంబర్‌ నెల కోటా రేషన్‌ పంపిణీ చేశారు.  

Updated Date - 2020-12-15T05:46:29+05:30 IST