-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari ramalingeshwara temple
-
క్షీరారామంలో లక్షపత్రి పూజ
ABN , First Publish Date - 2020-12-16T04:31:23+05:30 IST
మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పట్టణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష పత్రి పూజలు నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్, డిసెంబరు 15 : మార్గశిర మాసం పాడ్యమి సందర్భంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పట్టణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష పత్రి పూజలు నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, నవగ్రహారాధన, సూర్య నమస్కా రాలు, సుందరకాండ పారాయణ, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వా ర్చన (లక్షపత్రి పూజ), విఘ్నేశ్వరపూజ అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. వలివేటి శ్రీహరి శర్మ, తనికెళ్ళ శ్రీనివాస్, వి.శంకర్, ఎం.రవీంద్ర, నగేష్‌శర్మ, మోగంటి మల్లేశ్వరరావు, కిష్టప్ప, అనిల్ కుమార్ శర్మ, భమిడిపాటి వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.
మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు క్షీరా రామలింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో మంత్రి రంగనాథరరాజుకు ఈవో యాళ్ళ సూర్యనారాయణ, ఆలయ అర్చకులు మల్లేశ్వరరరావు, కృష్ణప్ప, పూర్ణయ్య, అనిల్ స్వాగతం పలి కారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్‌తాతాజీ పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.