-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari prema mosam
-
ప్రేమించానని మోసగించాడు!
ABN , First Publish Date - 2020-12-28T04:44:34+05:30 IST
తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు కుమా రుడితో కలిసి ప్రియురాలు ఆదివారం నిరసన దీక్షకు దిగింది.

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
యలమంచిలి, డిసెంబరు 27 : తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు కుమా రుడితో కలిసి ప్రియురాలు ఆదివారం నిరసన దీక్షకు దిగింది. యల మంచిలి మండలంలో కొంతేరు గ్రామానికి చెందిన విల్లూరు రాజవల్లిని అదే గ్రామానికి చెందిన విప్పర్తి సుధాకర్ సుమారు నాలుగేళ్ల కిందట ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. కొంత కాలానికి ఆమె మగబిడ్లకు జన్మనిచ్చింది.అనంతరం ఎన్నిసార్లు పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా సుధాకర్ పట్టించుకోకపో వడంతో 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం సమాజంలో అవమానం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దీక్షకు దిగానని వాపోయి ంది. న్యాయం జరిగే వరకూ దీక్ష విరమించేది లేదని ఆమె తెలిపారు.