అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN , First Publish Date - 2020-12-16T04:39:05+05:30 IST

డీఎన్నార్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ బి.శాంతకుమారి తెలిపారు.

అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి
డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళి

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 15 : డీఎన్నార్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ బి.శాంతకుమారి తెలిపారు. కళాశాల అధ్యక్ష్య కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు మహనీయుడు అన్నారు. పి.రామకృష్ణంరాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం ఆఫీసర్లు కె.సోమయ్య, ఎస్‌.అనిల్‌దేవ్‌, చెల్లబోయిన రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌ : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్యసంఘం నాయకులు నివాళులర్పించారు. సంఘ అధ్యక్షు డు మామిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములును రాష్ట్ర ప్రజలు మరువరన్నారు. చిన్న గోపురం వీధిలోని కల్యాణ మండపంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా గాందీ బొమ్మల సెంటర్‌, తహసీల్దార్‌ కార్యాలయం సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపాక ప్రవీణ్‌భాను, శ్రిఖాకొల్లు కామేశ్వరరావు, చిన గొల్లబాబు, సలాది జనార్ధనరావు, బి.నాగరాజు, బలభద్ర బాల రెడ్డియ్య, ఆర్‌ సత్యనారాయణ, బంగారు రంగనాధస్వామి, గమిని నానాజీ పాల్గొన్నారు. బీఆర్‌ఎంవీఎం హైస్కూల్‌ ఆవరణలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు కర్రా జయసరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read more