పందెం.. పంతం

ABN , First Publish Date - 2020-12-30T05:39:19+05:30 IST

సంక్రాంతి పండుగంటే ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయాలతోపాటు ప్రధానంగా గుర్తుకు వచ్చేది కోడి పందేలే. సంప్రదాయం అంటూనే కత్తులతో కోళ్లు కాలు దువ్వుతుంటా యి. కోట్లాది రూపాయలు చేతులు మారుతుం టాయి.

పందెం.. పంతం
కాలు దువ్వుతున్న కోళ్లు

కాలు దువ్వారో.. కేసులు తప్పవన్న పోలీసులు

పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో బ్యానర్‌లు 

ఆడిస్తున్న నిర్వాహకులపైనే కాదు.. స్థలం ఇచ్చే వారిపైనా కేసులంటూ హెచ్చరికలు

గుంభనంగా పందెగాళ్లు.. రహస్య మంతనాలు 

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి పండుగంటే ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయాలతోపాటు ప్రధానంగా గుర్తుకు వచ్చేది కోడి పందేలే. సంప్రదాయం అంటూనే కత్తులతో కోళ్లు కాలు దువ్వుతుంటా యి. కోట్లాది రూపాయలు చేతులు మారుతుం టాయి. చివరిరోజు వరకు అనుమతి లేదంటూ హెచ్చరికలు జారీ చేసే పోలీసులు పండుగరోజు నాటికి చేతులెత్తేసే పరిస్థితి ఏటా చూస్తున్నదే. కేసులు నమోదు చేసినా సరే బరి నిర్వాహకులు పెద్దగా పట్టించుకోరు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది పోలీసులు ముందస్తుగానే రంగంలోకి దిగుతున్నారు. పందేలు వేసేందుకు వీలు లేదం టూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి ఉండడంతో ఈ ఏడాది కోడి పందే లకు అవకాశం ఇచ్చేది లేదంటూ పోలీసులు  చెబుతున్నారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో బ్యానర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలు వద్దు.. సంప్రదాయాలే ముద్దు అంటూ అవగా హన కల్పిస్తున్నారు. పోలీసు – రెవెన్యూ శాఖలు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేస్తూ బ్యానర్‌లు సిద్ధం చేశారు. బరి నిర్వ హించడమే కాదు అందుకు స హకరిస్తూ స్థలం ఇచ్చే వారిపైనే కేసులు ఉం టాయం టూ తేల్చి చెపుతు న్నారు. కోడి పందేలు వద్దు కరో నా జోలికి పోవద్దం టూ బ్యానర్‌లు సిద్ధమ య్యాయి. 


గుంభనంగా నిర్వాహకులు

మరోవైపు కోడి పందేల నిర్వాహకులు సైతం ప్రస్తుతం గుంభనంగా ఉన్నారు. కరోనా నేప థ్యంలో పందాలు ఉంటాయా... ఉండవా అన్న చర్చ నడుస్తోంది. పల్లెల్లో నిర్వాహకులు ప్రత్యేకం గా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చడీచప్పుడు లేకుండా పందేలు నిర్వహిం చు కుందామంటూ తీర్మానించుకుంటున్నారు. సం క్రాంతి  రోజుల్లో కోడిపందేల నిర్వహణ జిల్లాలో ప్రజా ప్రతినిధులు ప్రతిష్టగా తీసుకుంటారు. పందేల నిర్వహణకు ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకురా వడంలో ప్రజా ప్రతినిధులే కీలకంగా వ్యవహరిస్తుంటారు. అటు వంటిది ఈ ఏడాది ప్రజా ప్రతినిధులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొందరు  నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తీర్థయాత్రలకు ప్రణా ళికలు చేసుకుంటున్నారు. దీంతో కోడి పందేలకు సైతం ప్రజా ప్రతినిధుల నుంచి ఈ ఏడాది ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అంతటికీ కరోనాయే పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. మొత్తం పైన ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు వస్తాయోనంటూ అంతా ఎదురుచూస్తున్నారు. పోలీసుల ముందస్తు హడావుడి చూస్తుంటే పందేలు నిర్వహించకుండా కట్టడి చేస్తామన్న ధీమా కనిపిస్తోంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో ?


కఠిన చర్యలు : ఎస్పీ

ఏలూరు క్రైం, డిసెంబరు 29 : సంప్రదా యం పేరిట ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ కె.నారాయణ నాయక్‌ హెచ్చరించారు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే రెవెన్యూ, పోలీస్‌ బృందాలు 48 మండ లాల్లో పనిచేస్తాయని, ఇన్‌కంటాక్స్‌  అధికారుల ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహిం చేందుకు రంగం సిద్ధమైందన్నారు. కోడి పందే లకు పాల్పడితే కేసులు నమోదు చేసి వివరాల ను కోర్టులకు, ఇన్‌కంటాక్స్‌ అధికారులకు అంద జేస్తామన్నారు. 


Updated Date - 2020-12-30T05:39:19+05:30 IST