రామానుజన్ చరిత్రపై రేపు వ్యాసరచన పోటీలు
ABN , First Publish Date - 2020-12-21T04:22:57+05:30 IST
భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలను మంగళవారం ఉదయం 11 గంటలకు సత్రంపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించనున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 20 : భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలను మంగళవారం ఉదయం 11 గంటలకు సత్రంపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించనున్నట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాల బాలికలకు వ్యాసరచన,మ్యాథ్స్ మోడలింగ్ అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి స్కూలు నుంచి గణిత ఉపాధ్యాయులు విద్యార్థులతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జీవితచరిత్ర అనే అంశంపై వ్యాసరచనపోటీ జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి పోటీలో ఎంపికైన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. వివరాలకు జిల్లా సైన్సు ఆఫీసర్ సీహెచ్ ఆర్‌ఎం చౌదరి ఫోన్ 9440712412కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.