-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari police
-
వీరవాసరం ఏఎస్‌ఐపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-16T04:28:59+05:30 IST
క్షణికావేశంలో వీరవాసరం ఏఎస్‌ఐ పి.పార్థసారఽథిపై కత్తితో దాడి చేసిన రొంగల అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వీరవాసరం, డిసెంబరు 15 : క్షణికావేశంలో వీరవాసరం ఏఎస్‌ఐ పి.పార్థసారఽథిపై కత్తితో దాడి చేసిన రొంగల అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరవా సరం పోలీస్ స్టేషన్‌లో మంగళ వారం నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి వివరాలను వెల్లడిం చారు. వీరవాసరం తలతాడతిప్ప ఆయకట్టులో నౌడు వెంకట రమణకు చెందిన వరి పొలాన్ని చిత్తజల్లు గోపికిశోర్ కౌలుకు చేస్తున్నాడు. భూయజమానితో ఉన్న వివాదం కారణంగా రొంగల అరుణ్‌కుమార్ పంటను కోసుకుపోతుండగా అడ్డుకోవడానికి వెళితే దాడి చేస్తున్నారని కౌలు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ సీహెచ్‌బీఎస్ మూర్తి విచారణకు వెళ్లారు. అప్పటికే నిందితుడు అరుణ్ కుమార్ కత్తి పట్టుకుని గోపి కిశోర్‌ను తరుముతుండగా ఏఎస్‌ఐ,హెడ్‌కానిస్టేబుల్ అడ్డుకు న్నారు.ఆ కత్తి ఏఎస్ ఐకు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.హెడ్ కానిస్టేబుల్ సీహెచ్‌బీఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోమవారం అరుణ్‌కుమార్‌ను వీరవాసరం గొంతేరు సమీపంలో అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన అనంతరం రౌడీ షీట్ నమోదు చేస్తామని తెలిపారు.సమావేశంలో పాలకొల్లు రూరల్, భీమవరం వన్‌టౌన్ సీఐలు పి.వెంకటేశ్వరరావు, భగవాన్, వీరవాసరం ఎస్‌ఐ రామచంద్రరావు పాల్గొన్నారు.