ఫ్లాట్‌ కొంటే మరో ఫ్లాట్‌ ఫ్రీ !

ABN , First Publish Date - 2020-12-29T05:24:19+05:30 IST

పండుగ సందర్భాలలో వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్ల గురించి వింటూనే ఉంటాం. చీర కొంటే చీర ఉచితం, జీన్‌ ఫ్యాంట్‌ కొంటే మరో ఫ్యాంట్‌ ఉచితం అంటూ పలు రకాల ఆఫర్లతో కొను గోలుదార్లను ఆకర్షిస్తారు. వివిధ వ్యాపార రంగాల్లో ఇలాంటివి మనం చూశాం. జిల్లాలోని ఓ ప్రాంతంలో తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఓ బిల్డర్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ఫ్లాట్‌ కొంటే మరో ఫ్లాట్‌ ఫ్రీ !

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త ఒరవడి

నష్టాల ఊబి నుంచి బయటపడేందుకే..

పాలకొల్లు, డిసెంబరు 28: పండుగ సందర్భాలలో వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్ల గురించి వింటూనే ఉంటాం. చీర కొంటే చీర ఉచితం, జీన్‌ ఫ్యాంట్‌ కొంటే మరో ఫ్యాంట్‌ ఉచితం అంటూ పలు రకాల ఆఫర్లతో కొను గోలుదార్లను ఆకర్షిస్తారు. వివిధ వ్యాపార రంగాల్లో ఇలాంటివి మనం చూశాం. జిల్లాలోని ఓ ప్రాంతంలో తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఓ బిల్డర్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై తీవ్ర చర్చ నడుస్తోంది. రూ.35 లక్షలకే ఫ్లాట్‌ అంది స్తామని రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఉచితంగా ఇస్తామని బిల్డర్‌ ప్రకటించడం గమనిస్తే జిల్లాలో నిర్మాణ రంగం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి రియల్‌ వ్యాపారం ఇప్పటి వరకు కోలుకోలేదు నాలుగేళ్లుగా భవన నిర్మా ణాలు మూడింట ఒక వంతుకు తగ్గిపోయాయి. బిల్డరు తీవ్ర నష్టాలను చవిచూశారు. నోట్ల రద్దుకు ముందు జిల్లాలో సుమారు 2000 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉండగా ఇప్పటికీ అందులో 50 శాతం పైబడి అమ్మకాలు లేక, బిల్డర్లు పెట్టిన పెట్టుబడుల కు వడ్డీలు కట్టలేక కుదేలయ్యారు. నష్టాలు తట్టుకోలే ని కొందరు బిల్డర్లు అప్పుల బాధయినా తప్పుతుం దనే ఆలోచనతో ఇలాంటి ఆఫర్లు ఇస్తూ అమ్మకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. 

Updated Date - 2020-12-29T05:24:19+05:30 IST