లక్ష్మీనారాయణుడి ఆలయంలో ధనుర్మాస పూజలు

ABN , First Publish Date - 2020-12-18T04:56:41+05:30 IST

స్థానిక అష్ట భుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మా స పూజలు కొనసాగుతున్నాయి.

లక్ష్మీనారాయణుడి ఆలయంలో ధనుర్మాస పూజలు
అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 17 : స్థానిక అష్ట భుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మా స పూజలు కొనసాగుతున్నాయి. స్వామి, అండాళ్ల మ్మను గురువారం  ప్రత్యేకంగా అలంకరించి, పూజ లు నిర్వహించారు. రేపాక సుధారాణి వీణాగానం వినిపించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌  అనుమతి పొందిన తోట వరలక్ష్మి తిరుప్పావై ప్రవ చనం చేశారు. కరి పవన్‌కుమార్‌ పాశురార్ధ వివరణ వినిపించారు. ఆలయ అర్చకులు కరి వెంకట శ్రీనివా సాచార్యులు, పూలపల్లి కృష్ణమాచార్యులు, ఈవో పీటీ గోవిందరావు, భక్తులు నున్న కోటేశ్వరరావు, మాజేటి రాంబాబు, రేపాక ప్రవీణ్‌భాను, జివి భాస్కరరావు, ఎం.శేషకిరణ్‌  గుప్త, మామిడి బాబు, పీవీఆర్‌ఎస్‌ గిరిస్వామి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:56:41+05:30 IST