దాళ్వా నారుమడులు సిద్ధం
ABN , First Publish Date - 2020-12-12T04:48:22+05:30 IST
సార్వా పనులు సాగుతుండగానే రైతులు మరో వైపు దాళ్వా సాగుకు సన్నద్ధమయ్యారు.
పాలకోడేరు, డిసెంబరు 11: సార్వా పనులు సాగుతుండగానే రైతులు మరో వైపు దాళ్వా సాగుకు సన్నద్ధమయ్యారు. మండలంలో సార్వా సాగు ఆరంభంలో వర్షాలతో రెండు మూడు పర్యాయాలు నాట్లు వేసిన రైతులు పంట చేతికొచ్చే దశలో వరదలతో నష్టపోయారు. మిగిలిన చేల్లో పంట మాసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. దాళ్వా సాగులో కాల్వల కట్టివేత ప్రకటన రైతులను సందిగ్ధంలో పడేసింది. ముందుగా సార్వా పనులను చక్కబెట్టుకున్న రైతులు నారుమడులను వేసుకుంటున్నారు. మండలంలో ఒకేసారి సార్వా, దాళ్వా పనులు సాగుతున్నాయి. త్వరితగతిన దాళ్వా నారుమడులను వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి నారాయణరావు సూచిస్తున్నారు.