-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari nivali
-
వైటీఆర్ లేని లోటు తీరనిది : ఆరిమిల్లి
ABN , First Publish Date - 2020-12-16T04:31:53+05:30 IST
వైటీఆర్‌లేని లోటు తీరనిదని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

తణుకు, డిసెంబరు 15 : వైటీఆర్‌లేని లోటు తీరనిదని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వైటి రాజా జయంతిని పురస్కరించుకుని మంగళవారం టీడీపీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా బారిన పడి గత నెలలో వైటి రాజా దూరమవడం దురదృష్టకరమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుతావసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మంత్రిరావు వెంకటరత్నం, కలగర వెంకటకృష్ణ, బసవా రామకృష్ణ, తోట సూర్యనారాయణ, తాతపూడి మారుతీరావు, తమరాపు పల్లపరావు, తణుకు రేవతి, ఆనాల ఆదినారాయణ పాల్గొన్నారు.