చెరువు గట్టు..మాయమైపోతోంది!

ABN , First Publish Date - 2020-12-21T04:24:07+05:30 IST

తాగునీటి చెరువు గట్టు తవ్వేస్తున్నా అధికా రులు కనీసం కన్నెత్తి చూడడం లేదు..

చెరువు గట్టు..మాయమైపోతోంది!
చెరువు వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న గ్రామస్థులు

గట్టు బలహీన పడుతుందంటూ గ్రామస్థుల నిరసన

పెంటపాడు, డిసెంబరు 20 : తాగునీటి చెరువు గట్టు తవ్వేస్తున్నా అధికా రులు కనీసం కన్నెత్తి చూడడం లేదు.. దీంతో గ్రామస్థులే ఆందోళనకు దిగారు.. చెరువు గట్టుకు రక్షణ కల్పించాలని నిరసన ప్రదర్శన చేశారు.  అలంపురం గ్రామంలోని గొల్లగుంట తాగుచెరువు గట్టుకు సంబంధించిన మట్టి అనధికారికంగా తీసుకువెళ్లిపోతున్నారంటూ కొంతమంది గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. గట్టు మట్టి పూర్తిగా తీసుకువెళ్లి పోతున్నారని దీని వల్ల చెరువు గట్టు బలహీనపడిపోతుందన్నారు. మట్టి తవ్వకం కారణంగా వర్షాకాలంలో  చెరువు నిండితే గ్రామాన్ని ముంచెత్తుతుందని భయపడుతున్నారు. చెరువు చుట్టూ నిర్మించే ప్రహరీ గోడ కూడా నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారన్నారు. చెరువు అభివృద్ధి పేరుతో మట్టిని తీసుకువెళ్లి చెరువు నాణ్యతను పూర్తిగా దిగజారుస్తున్నారన్నారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో వల్లూరి మనోజ్‌కుమార్‌, పారిచర్లసాయి, పర్వతనేని హేమంత్‌, పెనుమర్తి వీరసూర్యనారాయణ,మల్లపు సుబ్బారావు, కొనకళ్ళ బాలాజీ తదితరుల పాల్గొన్నారు. దీనిపై ఇన్‌చార్జి తహసీల్దార్‌ అనురాధను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించలేదు.

Updated Date - 2020-12-21T04:24:07+05:30 IST