రెండో ఫేజ్‌కు నిట్‌ రెడీ

ABN , First Publish Date - 2020-12-29T05:19:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ(ఏపీ నిట్‌) రెండో ఫేజ్‌ అభివృద్ధికి సిద్ధమ వుతోంది. తొలి ఫేజ్‌లో రూ.500 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులు చేపట్టారు. రెండో ఫేజ్‌ లో ఐదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

రెండో ఫేజ్‌కు నిట్‌ రెడీ
నిట్‌ ముఖద్వారం

ఐదేళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలన్న కేంద్రం

బీవోజీలో తీర్మానం.. రూ.750 కోట్లతో ప్రతిపాదనలు

అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌ వసతి

ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక భవనం ఏర్పాటు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ(ఏపీ నిట్‌) రెండో ఫేజ్‌ అభివృద్ధికి సిద్ధమ వుతోంది. తొలి ఫేజ్‌లో రూ.500 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులు చేపట్టారు. రెండో ఫేజ్‌ లో ఐదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల నిర్వహించిన నిట్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ సమావేశంలోనూ దీని పై చర్చించారు. ఆ మేరకు  రూ.750 కోట్ల విలు వైన ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. 


ఒక్కో కోర్సుకు.. ఒక్కో భవనం

అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్‌, ఒక్కో డిపా ర్ట్‌మెంట్‌కు ప్రత్యేక భవన సముదాయం, స్టాఫ్‌ క్వార్టర్స్‌, పరిశోధన కేంద్రాలు ఉంటాయి. నిట్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య త్వరలోనే వందకు చేరనుంది. ఇందుకు తగ్గట్టుగా వారికి ప్రత్యేక హాస్టల్‌ భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఇక్కడ ఎనిమిది బీటెక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. అన్నింటికి ఒకే భవన సముదాయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. రెండో ఫేజ్‌లో ప్రతి కోర్సుకు ప్రత్యేక భవనం ఏర్పాటు కానుంది. పరి శోధన కేంద్రాలపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమ య్యాయి. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాల ద్వారా అధ్యయన, పరిశోధనలు నిర్వహించాలని సంక ల్పించారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏఐ అండ్‌ డాటా సెంటర్‌, హై పెర్‌ ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో హైఓల్టేజ్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ విభాగంలో అడిటివ్‌ అండ్‌ కాంపోజిట్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ర్టీ విభాగంలో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎనర్జీ ఎఫ్ఫిసియెంట్‌ స్టోరేజ్‌ డివైసీస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి దాదాపు రూ.150 కోట్లు ఖర్చవుతుంది. ఈ పరిశోధన కేంద్రాలు ఏర్పాటైతే సుదీర్ఘ అనుభవం ఉన్న నిట్‌ సంస్థల సరసన ఏపీ నిట్‌ చేరిపోనుంది. పరి శోధన కేంద్రాలు ఏర్పాటైతే ఇక తిరిగి చూసే పనిలేదని నిట్‌ అధికా రులు భావిస్తున్నారు. 


పెరగనున్న విద్యార్థులు

ప్రస్తుతం 603 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు అమలు చేస్తున్న పది శాతం రిజర్వేషన్లు ఏపీ నిట్‌లో అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య 720కి చేరనుంది. పీహెచ్‌ డీ, ఎంటెక్‌ కోర్సుల్లోనూ సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. మొత్తంగా 5,000 మంది విద్యార్థులు ఏపీ నిట్‌లో చదివేలా ప్రణాళిక రూపొంది స్తున్నారు.

Updated Date - 2020-12-29T05:19:38+05:30 IST