ఆధార్ కేంద్రం లేక అవస్థ
ABN , First Publish Date - 2020-12-30T04:29:55+05:30 IST
ఆధార్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రస్తుతం ఏ పనికావాలన్నా ఆధార్ ఉండాల్సిందే.. అది లేకపోతే పని జరగడం లేదు.. పోనీ ఆధార్ చేయించుకుందామంటే ఆ అవకాశమూ లేదు.ఎందుకంటే ఎక్కడికక్కడ ఆధార్ కేంద్రాలు మూతపడిపో యాయి.
ఆధార్ అప్‌డేట్‌కు అష్టకష్టాలు
నిడమర్రులో మూతపడిన కేంద్రాలు
గణపవరంలో కేంద్రమే ఆధారం
వలంటీర్లకు ఉన్నా పనిచేయని సర్వర్
నిడమర్రు, డిసెంబరు 29 : ఆధార్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. ప్రస్తుతం ఏ పనికావాలన్నా ఆధార్ ఉండాల్సిందే.. అది లేకపోతే పని జరగడం లేదు.. పోనీ ఆధార్ చేయించుకుందామంటే ఆ అవకాశమూ లేదు.ఎందుకంటే ఎక్కడికక్కడ ఆధార్ కేంద్రాలు మూతపడిపో యాయి.దీంతో ఆధార్ చేర్పులు మార్పులకు అష్టకష్టాలు పడుతు న్నారు. దిక్కుతోచక దీనంగా తిరుగుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్త ంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అమ్మఒడి ఆన్‌లైన్ ఖాతాలలో ఆధార్ నాట్ మ్యాచ్‌డ్ అని రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ నమోదుకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిడమర్రు మండలంలో 17 గ్రామాల్లో ఒక్క ఆధార్ నమోదు కేంద్రం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గణపవరం మండ లంలో 65 వేల జనాభా, నిడమర్రు మండలంలో 45 వేల జనాభాకు తగిన ఆధార్ సెంటర్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్క మండలమైన గణపవరంలో గల స్టేట్ బ్యాంక్‌లో ఆధార్ సెంటర్ మాత్రమే ఏకైక దిక్కులా పనిచేస్తుంది. ఒక్క కేంద్రం కావడంతో ఆ సెంటర్ కూడా రద్దీ ఎక్కువై రోజుకి 150 నుంచి 200 మందికి మాత్రమే ఆధార్ అప్‌డేట్ అయ్యే పరిస్థితి నెలకొంది. గణపవరం పోస్టాఫీస్‌లో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఆ సెంటర్ పనితీరు నామమాత్రంగా ఉంటుంది. ఎవరూ వెళ్లినా సర్వర్ పనిచేయడం లేదని సమాధానం మాత్రం వినయంగా చెబుతున్నారు తప్ప ఎవ్వరికీ ఆధార్ నమోదు జరగడంలేదు. దీంతో గణపవరం, నిడమర్రు మండలాల ప్రజలు ఆధార్ నమోదుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏ పథకం అమలు చేయాలన్నా..
ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకం అమలు చేయాలన్నా లబ్ధిదా రుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడో పదేళ్ల కిందట తీయించుకొన్న ఆధార్ కార్డును ప్రభుత్వ అధికారులకు సమర్పిస్తుంటే ఆన్‌లైన్‌లో చూసి ఆధార్ అప్‌డేట్ కాలేదంటూ పంపించివేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఏమి చేయాలో తోచక అసహనం వ్యక్తం చేస్తు న్నారు. గ్రామాల్లో సచివాలయం గాని,ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లినా ఆధార్ అప్‌డేట్ చేయడంలేదు.గ్రామాల్లో వలంటీర్లకు ఆధార్ అప్‌డేట్ సౌకర్యం కల్పించినప్పటికీ వారి వద్ద అవడంలేదని లబ్ధిదారులు వాపో తున్నారు. ప్రభుత్వ పరిధిలో గాని ప్రైవేటు పరంగా గానీ మరిన్ని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.