-
-
Home » Andhra Pradesh » West Godavari » West Godavari news dist hospital
-
జిల్లా ఆస్పత్రిలో మరో 10 పడకల వార్డు
ABN , First Publish Date - 2020-03-23T11:13:32+05:30 IST
జిల్లా ఆస్పత్రిలో మరో 10 పడకల వార్డు

మాక్ డ్రిల్ నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది
ఏలూరు క్రైం, మార్చి 22 : కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏలూరు ప్రభు త్వాస్పత్రిలో 10 పడకలతో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయగా, జంగారెడ్డి గూడెం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రభుత్వాస్పత్రుల్లో నాలుగు పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశా రు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 138 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఏలూరు ప్రభుత్వా స్పత్రిలో 10 పడకలతో కూడిన ఒక వార్డును కలెక్టర్ ఆదేశాల మేరకు ఆది వారం సిద్ధం చేశారు.
అనుమానిత కేసులు వస్తే ఏ విధంగా తీసు కురావాలి, వారిని ఎలా ఐసో లేషన్ వార్డుకు తరలించాలన్న దానిపై 108 జిల్లా మేనేజర్ రాజ్‌కుమార్, ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) ఇమాన్స్ కౌశిక్ స్వయంగా పరిశీలించి అభినందించారు. ఇదే విధంగా సేవలను కొనసాగించాలని అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావుకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.