రేపు కర్ఫ్యూ పాటించండి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-03-21T08:58:37+05:30 IST

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ప్యూ అమలుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌...

రేపు కర్ఫ్యూ పాటించండి : ఎస్పీ

ఏలూరు క్రైం, మార్చి 20 : ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ప్యూ అమలుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌  తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలందరూ తమ ఇళ్ళల్లోనే ఉండాలన్నారు.జిల్లాలోని అన్ని చర్చిలు, మసీ దులు,ఇతర ప్రార్థనా మందిరాలకు భక్తులు రాకుండా  చూసుకోవాలని  జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఏడీ పీ పద్మావతి శుక్రవారం సూచించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటలకు రెండు నిమిషాల ముందే సైరన్‌ మోగిస్తారని ఆ సమయంలో ఇంటి ముందు భాగంలో గాని డాబాలపై గాని ప్రజలు నిలబడి చప్పట్లు కొట్టి జనతా కర్ప్యూకి ఆమోదాన్ని తెలియజే యాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లోగాని వైద్య సహాయం అవసరాలకు మాత్రమే బయటకు రావాలన్నారు.

Updated Date - 2020-03-21T08:58:37+05:30 IST