-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari narasapuram ferry
-
మాధవాయిపాలెం రేవులో రాకపోకలు పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2020-12-16T04:26:52+05:30 IST
మాధవాయిపాలెం – సఖినేటిపల్లి మధ్య పంటు, పడవ రాకపోకలు పునరుద్ధరించాలంటూ బీజేపీ, జనసేన సంయుక్తంగా మంగళవారం ధర్నా నిర్వహించాయి.

నరసాపురం టౌన్, డిసెంబరు 15: మాధవాయిపాలెం – సఖినేటిపల్లి మధ్య పంటు, పడవ రాకపోకలు పునరుద్ధరించాలంటూ బీజేపీ, జనసేన సంయుక్తంగా మంగళవారం ధర్నా నిర్వహించాయి. శివాలయం సెంటర్ నుంచి రేవు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరిగి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోక పోతన, ఎంపీడీవో ప్రసా ద్ యాదవ్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. జనసేన నియోజకవర్గ కన్వీనర్ నాయకర్, బీజేపీ నాయకులు ప్రకాశ్ మాట్లాడుతూ 8 నెలలుగా రేవును మూసివేయడం వల్ల ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం గోదావ రిలో పంటు, పడవలకు అనుమతినివ్వాలన్నారు. జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరావు, వాతాడి కనకరాజు, వలవల కుమార్, అంబటి అరుణ, దివి సత్యన్, బీజేపీ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరావు, జి.శ్రీను పాల్గొన్నారు.