ముక్కోటి దర్శనం

ABN , First Publish Date - 2020-12-25T05:54:52+05:30 IST

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఈ రోజే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి మహా విష్ణువును దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ముక్కోటి దర్శనం
ద్వారాకాతిరుమలలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు

జిల్లాలో ముస్తాబైన వైష్ణవాలయాలు 

ద్వారకా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

ఉదయం ఐదు నుంచి ఉత్తర ద్వార దర్శనం

ద్వారకా తిరుమల, డిసెంబరు 24 : నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఈ రోజే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి మహా విష్ణువును దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా దర్శించుకోవడం ద్వారా ఐహిక సుఖాలు సం ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యా యి. పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి, జంగారెడ్డిగూడెం పారిజాత గిరి, కాళ్లకూరు, పెంటపాడు, ఏలూరు ఆర్‌ఆర్‌ పేటల్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు, కె.పెంటపాడు బైరాగి మఠంలోని వేణు గోపాలస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలిపారు. భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకు నేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు. మరో రెండు రోజులు శని, ఆదివారాల్లోను ఉత్తర ద్వారం తెరిచే ఉంచుతారు. ఉచిత దర్శనంతోపాటు వంద, 200, 300 రూపాయలు టిక్కెట్ల ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతోపాటు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గత ఏడాది 60 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, ఈ ఏడాది తొలిరోజు 30 వేల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల దర్శనాలు ఉండటంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుందని అధికారు లు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ను ఏర్పాటుచేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధ నలు పాటించాలని ఈవో కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తోపాటు, శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-12-25T05:54:52+05:30 IST