చింతమనేని ఇంట పెళ్లంట..
ABN , First Publish Date - 2020-12-30T04:22:05+05:30 IST
మీరు పెళ్లికి రానక్కర్లేదు.. కానీ మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వధూవరులను దీవించండి.. అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కరోనా నేపథ్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఆన్‌లైన్‌లో దీవించాలని ఆహ్వానం
ప్రతీ ఇంటికి స్వీట్‌బాక్స్‌లు
పెదవేగి, డిసెంబరు 29 : మీరు పెళ్లికి రానక్కర్లేదు.. కానీ మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వధూవరులను దీవించండి.. అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కరోనా నేపథ్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఏలూరుకు చెందిన పారిశ్రామికవేత్త వంకినేని భాను కుమారుడు పృధ్వీతో చింతమనేని పెద్ద కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహం వచ్చే నెల రెండవ తేదీన నిశ్చ యించారు. నూతన దంపతులను నియోజకవర్గంలోని ప్రజలందరూ దీవించాలని కోరుతూ చింతమనేని ప్రభాకర్ తరతమ బేధం లేకుండా ఇంటింటికీ స్వీట్ బాక్స్‌లను పంచారు. ఆ స్వీట్ బాక్స్‌పై కుమార్తె వివాహ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా 94 వేల స్వీట్ బాక్స్‌లను పంపిణీ చేశామని ప్రభాకర్ తెలిపారు.