31 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తాం : మంత్రి

ABN , First Publish Date - 2020-12-21T04:18:52+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరు గుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరు కువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు

31 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తాం : మంత్రి

మాట్లాడుతున్న మంత్రి రంగనాథరాజు

దేవరపల్లి, డిసెంబరు 20 : రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరు గుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరు కువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు.దేవరపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆది వారం విలేకరులతో మాట్లాడారు. రూ.26 వేల కోట్లతో 68 వేల ఎకరాల భూసేకరణ చేసి 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ. 1.8 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కోర్టులో అడ్డంకుల వల్ల రిజిస్ర్టేషన్‌ పట్టాకు జాప్యం జరుగుతుందని కోర్టు అడ్డం కులు తొలగిన తరువాత రిజిస్ర్టేషన్‌ పట్టాలు అందజేయడం జరుగుతుం దన్నారు. తక్కువ ధరకు సిమెంట్‌, ఐరెన్‌ ప్రభుత్వం సరఫరా చేస్తు ందన్నారు. ఇంటి నిర్మాణానికి మహిళలకు కమిటీ వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


అర్హులందరికీ స్థలాలు అందాలి : జేసీ

ఉంగుటూరు : అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు అందజేయాలని జేసీ వెంకట రమణా రెడ్డి ఆదేశించారు.స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 27 గ్రామ పంచాయతీల పరిధిలో 2120 మంది లబ్ధిదారులకు గాను 58.71 ఎకరాల్లో 48 లేఅవుట్లను సిద్దం చేశామని తహసీల్దార్‌ జాన్‌రాజు తెలిపారు.

Updated Date - 2020-12-21T04:18:52+05:30 IST