మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు
ABN , First Publish Date - 2020-12-16T05:29:52+05:30 IST
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వై ఎస్ జగన్ ఐదు వందల కోట్లు మంజూరు చేసినట్లు ఉప ము ఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి నాని
ఏలూరు రూరల్, డిసెంబరు 15 : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వై ఎస్ జగన్ ఐదు వందల కోట్లు మంజూరు చేసినట్లు ఉప ము ఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు, కలెక్టర్ ముత్యాలరాజు, ఏపీఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, డీసీహెచ్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఏవీఆర్ మోహన్ ఇతర అధికారులతో మెడికల్ కళాశాల నిర్మాణంపై చర్చించారు. శుక్రవారం జరగ నున్న కేబినెట్ సమావేశంలో భవన నిర్మాణానికి ఆమోదముద్ర వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. కళాశాలలో 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయనిచెప్పారు.