పనిచేసే జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు : శ్రీనాథ్‌

ABN , First Publish Date - 2020-12-26T05:14:09+05:30 IST

జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సమస్యలను తీర్చడానికి ప్రెస్‌ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ అన్నారు.

పనిచేసే జర్నలిస్టులకే అక్రిడిటేషన్లు : శ్రీనాథ్‌

ఏలూరుకలెక్టరేట్‌, డిసెంబర్‌ 25 : జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సమస్యలను తీర్చడానికి ప్రెస్‌ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ అన్నారు. స్థానిక ఇరిగేషన్‌ అతిథిగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ విలేకరుల సమస్యల పరిష్కారానికి ప్రెస్‌ అకాడమీ కృషి చేస్తుందన్నారు. అక్రిడిటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని, పని చేస్తున్న జర్నలిస్టులకు తప్పకుండా అక్రిడిటేషన్లు వస్తాయన్నారు.సమాచారశాఖ ఏడీ నాగార్జున తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Updated Date - 2020-12-26T05:14:09+05:30 IST