-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari maavullamma
-
చూసిన కనులదే వైభోగం
ABN , First Publish Date - 2020-12-29T05:27:32+05:30 IST
మావుళ్లమ్మ నిజరూప దర్శనం సోమవారం ప్రారంభమైంది.

మావుళ్లమ్మ నిజరూప దర్శనం ప్రారంభం
భీమవరం టౌన్, డిసెంబరు 28 :మావుళ్లమ్మ నిజరూప దర్శనం సోమవారం ప్రారంభమైంది. వచ్చే నెల 13వ తేదీ నుంచి వార్షిక మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి అలంకారం నిమిత్తం ఈ నెల 19 నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఇప్పటి వరకు అమ్మవారి కలశానికి, కటౌట్‌కు పూజ లు చేశారు. అలంకారం పూర్తి కావడంతో సోమవారం ఉదయం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కళన్యాసం సహా హోమాలను జరి పారు. అమ్మవారి కళలను నిక్షిప్తం చేసిన కలశం నుంచి అమ్మ వారి విగ్రహంలోకి మంత్రాల ద్వారా ప్రవేశ పెట్టారు. గోదృష్టి, కుంభదృష్టి, కూష్మాండ దర్శనం మొదలైన కార్య క్రమాలను నిర్వహించి దర్పదర్శనం ద్వారా భక్తులకు అమ్మవారి నిజరూపదర్శ నం కల్పించారు. దేవస్థానం సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.