-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari leader
-
బీసీలను మోసగిస్తున్న జగన్ : గన్ని
ABN , First Publish Date - 2020-12-20T04:19:35+05:30 IST
పదవుల పందేరంలో రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలను జగన్ మోసం చేశారంటూ ఉం గుటూరు మాజీ ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు విమర్శించారు.

భీమడోలు, డిసెంబరు 19 : పదవుల పందేరంలో రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలను జగన్ మోసం చేశారంటూ ఉం గుటూరు మాజీ ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు విమర్శించారు. భీమ డోలులోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేక రులతో మాట్లాడారు. బీసీల మీద ప్రేమ ఉంటే ప్రతి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలన్నారు. ప్రచారానికి ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు నిధులు, విధులు కూడా లేవని చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని ఎద్దేవా చేశారు.అమరావతి 365 రోజుల నిరసన సెగను తప్పించుకోవడానికే బీసీల సంక్రా ంతి అంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాకా కత్తి వేటు వేస్తున్నారన్నారు.