-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari land survey
-
రీసర్వే మోడల్ మండలం మొగల్తూరు
ABN , First Publish Date - 2020-12-11T05:09:38+05:30 IST
భూముల రీసర్వేకు మోడల్ మండలంగా మొగల్తూరును ప్రభుత్వం ఎంపిక చేసింది.

మొగల్తూరు, డిసెంబరు 10: భూముల రీసర్వేకు మోడల్ మండలంగా మొగల్తూరును ప్రభుత్వం ఎంపిక చేసింది. రీ సర్వేకు ఏర్పాటు చేసే టవర్ నిర్మాణ ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ కేఎస్.విశ్వనాథన్ గురువారం పరిశీలించారు. జనవరి 1 నుంచి మండలంలో భూముల రీసర్వే చేపట్టనున్నారు. కుక్కల వారితోటలో గ్రామ సచివాలయంపై టవర్ నిర్మించేందుకు గుర్తించిన స్థలా న్ని, అనంతరం రామన్నపాలెంలో లేఅవుట్‌లను పరిశీలించారు. స్థలాలు పూర్తిస్థాయిలో మెరక చేసి లబ్థిదారులకు ఇవ్వాల్సిఉందని, మొగల్తూరు మండలంతో పాటు నరసాపురం మండలానికి మట్టి అవసరం ఉందన్నారు. ఇళ్ల స్థలాల పూడిక పనులను డిసెంబర్ 25 నాటికి పూర్తి చేయాలని, రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎస్‌కె.హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వోలు పాల్గొన్నారు.