కోట సత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-31T04:26:22+05:30 IST

తిమ్మ రాజుపాలెం కోటసత్తెమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలను చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్ర్తి దంపతులు బుధవారం ప్రారంభిం చారు.

కోట సత్తెమ్మ తిరునాళ్లు ప్రారంభం
ఉత్సవాలను ప్రారంభిస్తున్న చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్ర్తి దంపతులు

నిడదవోలు,డిసెంబరు 30 : తిమ్మ రాజుపాలెం కోటసత్తెమ్మ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలను చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్ర్తి దంపతులు బుధవారం ప్రారంభిం చారు. అనంతరం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మహన్యాస పఠనం, ఏకాదశ రుద్రాభిషే కాలు చేశారు. ఉదయం చండీ పారాయణం, సాయంకాలం హోమం జరిగాయి. ఈ పూజల్లో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు భక్తులు అమ్మవారికి విశేష పూజలు చేశారని ఈవో బళ్ల నీలకంఠం తెలిపారు.

Updated Date - 2020-12-31T04:26:22+05:30 IST