-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari job mela
-
29న ఎస్సీఐఎం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ABN , First Publish Date - 2020-12-20T04:20:27+05:30 IST
ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు.

తణుకు, డిసెంబరు 19 : ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని అన్నారు. ఎంపికైన అభ్యర్ధులు వెంటనే ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందన్నారు. జీతం ట్రైనింగ్‌లో రూ.12,700 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. వీఎస్‌ఎన్ గ్రూప్ హైదరాబాద్ వారు వెల్సపన్ టెక్స్‌టైల్స్ /పీవీసీ ఇండస్ట్రీ, హైదరాబాద్‌లో పొడక్షన్ /ఆపరేటర్ ఉద్యోగాలకు ఉద్యోగ మేళాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఏ, బీ కామ్,బీఎస్సీలలో పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 90590 23046/94914 19667 నెంబర్లలో సంప్రదించాలన్నారు.