-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari janasena
-
మంత్రులూ మాట తూలకండి : బొలిశెట్టి
ABN , First Publish Date - 2020-12-31T04:30:04+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రులు మాట తూలడం మంచి పద్ధతి కాదని జన సేన తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ బొలి శెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు.

తాడేపల్లిగూడెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రులు మాట తూలడం మంచి పద్ధతి కాదని జన సేన తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ బొలి శెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేప ల్లిగూడెంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌లకు పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌ను విమర్శించే నైతికత ఎక్కడదని నిలదీశారు. నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులకు రూ.30వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంలో తప్పేము ందని ప్రశ్నిం చారు. ఏలూరు ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రశ్నించకుండాఅణచివేసే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, కొనగళ్ల హరినాథ్, గట్టు గోపికృష్ణ పాల్గొన్నారు.