-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari input subsidy for release
-
రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు
ABN , First Publish Date - 2020-12-30T05:48:30+05:30 IST
వరుస విపత్తులతో ఈ ఏడాది సార్వాలో వేలాది హెక్టార్లలో రైతులు పంటలు నష్టపో యారు

59,080 హెక్టార్లలో పంట నష్టం
నష్టపోయిన1,21,484 మంది రైతులు
ఇన్‌పుట్ సబ్సిడీ రూ.88.36 కోట్లు
రైతు భరోసా రూ.70.55 కోట్లు విడుదల
ఏలూరు సిటీ, డిసెంబరు 29:
ఏలూరు సిటీ, డిసెంబరు 29: వరుస విపత్తులతో ఈ ఏడాది సార్వాలో వేలాది హెక్టార్లలో రైతులు పంటలు నష్టపో యారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, గోదావరి వరదలు, నవంబరులో భారీ వర్షాలు, నివర్ తుఫాను కారణంగా రైతులు పంట నష్టపోయారు. జిల్లాలో వరి, వేరుశనగ, ప్రత్తి, మొక్క జొన్న, మినుము పంట లకు నష్టం వాటిల్లింది. 1,21,484 మంది రైతులు నష్టపోగా వారికి రూ.88.36 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం మంగళవా రం విడుదల చేసింది. ఇందులో జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు 31709.752 హెక్టార్ల లో 66,573 మంది రైతులు పంట నష్టపోయారు. వీటికి సంబంధించి రూ. 47.38 కోట్లు, నవంబరు నెలలో వచ్చిన భారీ వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా 27370.46 హెక్టార్లలో 54,911 మంది రైతులు పంట నష్టపోయారు. వారికి 40.98 కోట్లు నిధులను పెట్టుబడి సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
రైతు భరోసా కింద రైతులకు అందించే సొమ్ము విడుదల చేసింది. మొత్తం రైతు భరోసా, పీఎం కిసాన్ కింద రూ.70.55 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఇప్పటికే ఇటీవల పీఎం కిసాన్ కింద సొంతంగా భూమి ఉన్న రైతు లకు రూ.65.45 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన రైతులకు సంబంధించి ఒక్కో రైతుకు రూ.2 వేలు చొప్పున రూ.5.09 కోట్లు నిధులు విడుదల చేశారు.
నెల విపత్తు పంట నష్టం నష్టపోయిన ఇన్‌పుట్
(హెక్టార్లలో) రైతులు సబ్సిడీ (కోట్లలో)
జూలై –20 భారీ వర్షాలు 1099 1937 1.65
ఆగస్టు –20 భారీ వర్షాలు/వరదలు 1904 4378 2.85
సెప్టెంబరు –20 భారీ వర్షాలు 7396 14927 11.08
అక్టోబరు –20 భారీ వర్షాలు 21310.752 45331 31.79
నవంబరు –20 భారీ వర్షాలు 5308.37 9806 7.96
నవంబరు –20 నివర్ తుపాను 22062.09 45105 33.03
మొత్తం 59080.212 1,21,484 88.36