లేఅవుట్లలో రోడ్లన్నీ పూర్తి చేస్తాం : ఆర్‌డీవో

ABN , First Publish Date - 2020-12-20T04:14:11+05:30 IST

దేవరపల్లి మండలంలోని అన్ని లేఅవుట్లలోనూ యుద్ధ ప్రతిపాదికన రోడ్లు పూర్తి చేయడం జరుగుతుందని కొవ్వూరు ఆర్‌డీవో కే.లక్ష్మారెడ్డిఅన్నారు

లేఅవుట్లలో రోడ్లన్నీ పూర్తి చేస్తాం : ఆర్‌డీవో
లేఅవుట్‌లో వేసిన రోడ్లు

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

దేవరపల్లి, డిసెంబరు 19 : దేవరపల్లి మండలంలోని అన్ని లేఅవుట్లలోనూ యుద్ధ ప్రతిపాదికన రోడ్లు పూర్తి చేయడం జరుగుతుందని కొవ్వూరు ఆర్‌డీవో కే.లక్ష్మారెడ్డిఅన్నారు.‘ఇంటి పట్టా ఇట్టాగేనా’ కలెక్టర్‌ ఆదేశమిచ్చిన మారని పరిస్థితి.అంటూ ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో శనివారం ప్రచురితమైన కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీ పట్నం, సంఘాయిగూడెం, బంధపురం గ్రామాల్లో లేఅవుట్ల రోడ్లు పూర్తికాక పోవడంతో అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు అధికారులు దగ్గరుండి లే అవుట్ల రోడ్ల పనులను పర్యవేక్షిస్తూ ముమ్మరం చేశారు. 

Read more