అర్హులందరికీ స్థలాలు

ABN , First Publish Date - 2020-12-29T05:20:54+05:30 IST

రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

అర్హులందరికీ స్థలాలు
నిడదవోలులో ఇంటి పట్టాల పంపిణీలో మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు, కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులు

మంత్రి కన్నబాబు

నిడదవోలు, డిసెంబరు 28 : రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం నిడ దవోలులో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తం గా రూ.650 కోట్లు అందిస్తున్నామన్నారు. నిడదవోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మార్కెట్‌ యార్డుకు స్థలం మంజూరు చేయించి వచ్చే నెలలోనే నిధులు ఇస్తామని ప్రకటించారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలం కోసం ఎవరైనా సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో స్థలసేకరణ చేసి స్థలాలు అందిస్తారన్నారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు మాట్లాడుతూ పట్టణ పరిధిలో మూడు వేల మందికి, నియోజక వర్గంలో 18 వేల మందికి ఇళ్ల స్థలాలు, నాలుగు వేల ఎనిమిది వందల మందికి సొంత స్థలం వున్న వారి ఇళ్ల నిర్మాణాలకు రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎంపీ భరత్‌, వైసీపీ నాయకులు కామిశెట్టి సత్యనారాయణ, మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:20:54+05:30 IST