పేదరికమే అర్హతగా స్థలాలు : మంత్రి ఆళ్ల నాని

ABN , First Publish Date - 2020-12-29T04:38:01+05:30 IST

రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలందరికీ మంజూరు చేయడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు.

పేదరికమే అర్హతగా స్థలాలు : మంత్రి ఆళ్ల నాని
పట్టా అందజేస్తున్న మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే

తణుకు రూరల్‌, డిసెంబరు 28 : రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలందరికీ మంజూరు చేయడం జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. తణుకు మండలం పైడిపర్రులో సోమవారం ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పేదరికమే కొలమానంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, వైకాపా సలహా మండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్‌, ఏఎంసీ చైర్మన్‌ ఉండవల్లి జానకి, వైస్‌ చైర్మన్‌ ములగాల శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఉంగుటూరు : నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు జేసీ హిమాన్షు శుక్లా తెలి పారు.కైకరం,అక్కుపల్లి గోకవరం, యర్రమిల్లిపాడు గ్రామాల్లో  పేదలకు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కైకరంలో 219, ఏ.గోకవరంలో 123, యర్రమిల్లిపాడులో 39 పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మరడ రమావతి, తహసీల్దార్‌ జాన్‌ రాజు,మరడ మంగారావు,పుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను,మాజీ ఎంపీపీ జయలక్ష్మి పాల్గొన్నారు. 


పెంటపాడు : రాజకీయాలకతీతంగా అర్హులందరికి ఇళ్ళ స్థలాలను అందజేస్తామని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు.మౌంజీపాడులో సోమవారం 41 మందికి పేదలకు ఇళ్ళస్థలాలు పంపిణీ చేసి మాట్లాడారు. సంవత్సరాల తరబడి ఇళ్ళు లేని పేదవారి కల నేటికి నెరవేరిందన్నారు.    కార్యక్రమంలో  కొట్టు విశాల్‌, కర్రి భాస్కరరావు, సపంత రావు కృష్ణారావు, మాజీ సర్పంచ్‌ మైలవరపు సుబ్బారాయుడు, ప్రత్యేకాధికారులు షాజానాయక్‌, ఎంఈవో శ్రీనివాస్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ అనురాధ, ఎంపీడీవో దామోదర్‌రావు ,   బోరాడశ్రీను, మజ్జి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:38:01+05:30 IST