ఇళ్ల పండుగ

ABN , First Publish Date - 2020-12-28T04:50:50+05:30 IST

ఇంటి పట్టాల పంపిణీతో సంక్రాంతి కంటే ముందే పెద్ద పండుగను లబ్ధిదారులు జరుపుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

ఇళ్ల పండుగ
పట్టాలు అందజేస్తున్న మంత్రి రంగనాథరాజు

గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

తణుకు రూరల్‌, డిసెంబరు 27 :  ఇంటి పట్టాల పంపిణీతో సంక్రాంతి కంటే ముందే పెద్ద పండుగను లబ్ధిదారులు జరుపుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.  తేతలిలో ఆదివారం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రయత్నంలో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండడం నా జీవితానికి ఇంతకంటే అదృష్టం వేరొకటి లేదన్నారు.పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించి ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లా డుతూ నియోజకవర్గంలో సుమారు 346 ఎకరాలు సేకరించి 18,570 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు అందించడం జరుగుతుందన్నారు. తేతలిలో 531 మంది లబ్ధిదారులకు 17 ఎకరాలు సేకరించామన్నారు.కోనాల, ముద్దాపురం, దువ్వ గ్రామాల్లోనూ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో   హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి, తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ ఉండవల్లి జానకి, వైస్‌ చైర్మన్‌ ములగాల శ్రీనివాస్‌, తణుకు మండల అధ్య క్షుడు బోడపాటి వీర్రాజు, మహిళా అధ్యక్షురాలు ముళ్ళపూడి రూప, వైసీపీ నియోజకవర్గ యూత్‌ ప్రెసిడెంట్‌ మట్టా వెంకట్‌, తేతలి గ్రామ అధ్యక్షుడు మట్టా నాగేశ్వరరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

భీమడోలులో..

భీమడోలు, డిసెంబరు 27 : అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.  భీమడోలు మం డలం గుండుగొలనులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయిస్తామ న్నారు. మండలంలోని ఆగడాలలంక, లక్ష్మీపురం, చెట్టున్నపాడు గ్రామాల్లో 1300 మందికి ఇళ్ళ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

నిడదవోలులో.. 

నిడదవోలు/ ఉండ్రాజవరం, డిసెంబరు 27 : పేదవారి ఇంటి కల తీరుస్తామని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు.  నిడదవోలు మండలం తాడిమళ్ళలో 232 మందికి, కోరుమామిడిలో 15 మందికి, ఉండ్రాజవరంలో 719 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలను అందించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న మాట నెరివేర్చి వారి జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు.నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీ సమీ పంలో సోమవారం మంత్రి మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పట్టాలు పంపిణీ చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.రాము, తహసీల్దార్‌ ఎం.గంగరాజు, ఉండ్రాజవరంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు, వైసీపీ మండల అధ్యక్షుడు నందిగం భాస్కరరా మయ్య, తహసీల్దార్‌ కనకరాజు, ఎంపీడీవో రమణ, డీఈ జాన్‌మోజస్‌, ఏఈ ఎం. విక్టర్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T04:50:50+05:30 IST