-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari house cites tensions
-
టెన్షన్..టెన్షన్
ABN , First Publish Date - 2020-12-30T05:56:33+05:30 IST
జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఇళ్ల పట్టాల పంపిణీలో పెరుగుతున్న వివాదాలు
పొలాలు లాక్కున్నారని శ్రీనివాసపురంలో ఒకరు..
స్థలం రాలేదని పెండ్యాలలో మరొకరు ఆత్మహత్యాయత్నం
జీలుగుమిల్లి పోలీసు స్టేషన్ స్థలంలో పట్టాల పంపిణీకి సిద్ధం
అడ్డుకున్న పోలీసులు.. ఫ్లెక్సీల ఏర్పాటు.. స్థలం స్వాధీనం
మార్టేరులో కులాల వారీగా ప్లాట్ల కేటాయింపు
(నిడదవోలు/జంగారెడ్డిగూడెం టౌన్/జీలుగుమిల్లి/పెనుమంట్ర)
జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నిడదవోలులో ఇంటి స్థలం రాలేదని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, తమ పొలాలను స్వాధీనం చేసుకోవద్దని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఇద్దరు వ్యక్తులు ఒంటిపై డీజిల్ పోసుకుని అధికారులను, స్థానికులను పరుగులు పెట్టించారు. మరోవైపు జీలుగుమిల్లి పోలీసుస్టేషన్ స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ స్థలంలో సీజ్ చేసిన మోటారు వాహనాలను ఉంచారు. దీంతో బుధవారం జరగాల్సిన పంపిణీ వాయిదా పడింది. పెనుమంట్ర మండలం మార్టే రులో కులాల వారీగా ప్లాట్ల కేటాయింపు వివాదాస్పదమైంది. వరుస వివాదాలు రావడం తో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒంటిపై డీజిల్ పోసుకుని...
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపు రం గ్రామానికి చెందిన తడికల మోహన్, తడి కల దావీదు తమ తాతల కాలం నుం చి సాగు చేసుకుంటున్న ఐదెకరాల భూమి ని ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం పట్టాల పంపిణీకి పొలం వద్దకు చేరుకున్న అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా అధికా రులు పొలం స్వాధీనానికే యత్నిస్తున్నారని ఒంటిపై డీజిల్ పోసుకొని పరుగులు తీశారు. వీరి వెంట స్థానికులు, అధికారయంత్రాంగంతోపాటు స్థానిక ఇన్‌చార్జి ఎస్‌ఐ కుటుంబరా వు పరుగులు తీసి అడ్డుకున్నారు. బాధితులు మాట్లాడుతూ స్థానిక వీఆర్వో అధికార పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ మురళీకృష్ణ బాధితుల తో మాట్లాడి సమస్య పరిష్కరించారు. పట్టాల పంపిణీని నిలిపివేశారు.
పురుగుల మందు తాగిన మహిళ
నిడదవోలు మండలం పెండ్యాలకు చెందిన ముప్పిడి అంజమ్మ తనకు ఇళ్ల స్థలం రాలేదని మంగళవారం సాయంత్రం పట్టాలు పంపిణీ జరిగే సభ వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వైద్య సేవల నిమిత్తం ఆమెను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు.కొవ్వూరు ఆర్‌డీవో లక్ష్మారెడ్డి వివరణ ఇస్తూ ఆమె డిసెంబరు 7న సచివాలయంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకుం దని.. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయ్యిం దని తెలిపారు. నవంబరు 27 వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పట్టాలు అందజే స్తున్నామని చెప్పారు. అంజమ్మ దరఖాస్తు చేసుకుని 22 రోజులే అయిందని, విచారణ చేసి అర్హత ఆధారంగా 90 రోజుల్లోగా పట్టా మంజూరు చేస్తామన్నారు.