రైతు ఉద్యమానికి మద్దతుగా 2న మోటార్ సైకిల్ ర్యాలీ
ABN , First Publish Date - 2020-12-30T04:30:05+05:30 IST
నల్లచట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతు జేఏసీకి మద్దతుగా జనవరి 2న నరసాపురంలో చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర కన్వీనర్ లంక కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.
భీమవరం, డిసెంబరు 29 : నల్లచట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతు జేఏసీకి మద్దతుగా జనవరి 2న నరసాపురంలో చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర కన్వీనర్ లంక కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో వామపక్ష, రైతు జేఏసీ సమావేశం మంగళవారం నిర్వహించారు. నరసాపురం నుంచి భీమవరం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టాలని తీర్మానించింది. నల్ల చట్టాలను ఉపసంహరించే వరకు రైతుల తరపున పెను ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. నల్ల చట్టాల వత్తాసుతో కార్పొరేట్‌లు కేవల వాణిజ్య పంటలపైనే మొగ్గు చూపుతారని దేశంలో తిండి గింజల కొరత ఏర్పడుతుందన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, హరేరాం, జక్కంశెట్టి సత్యనారాయణ, తదితరులు మాట్లాడుతూ రైతు ఆదాయం రెండింతలు చేస్తామని గద్దెనెక్కిన మోదీ చివరికి రైతుల నోట్లో మన్ను కొట్టారని దుయ్యబట్టారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే చాలని, రైతుపై ప్రేముంటే నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. దండు శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.